IPL-2025లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడింది. ఈ మ్యాచ్ అస్సాంలోని గౌహతీలో జరిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి, నేరుగా వెళ్లి రాజస్థాన్ రాయల్స్ స్టాండ్-ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కాళ్లపై పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.