జనవరి నుంచి రైతులకు రైతు భరోసా: తుమ్మల

61చూసినవారు
జనవరి నుంచి రైతులకు రైతు భరోసా: తుమ్మల
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా ఇవ్వనుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. యాదాద్రి(D) వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. BRS విధ్వంస పాలనతో నష్టపోయిన రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వం ORRను తాకట్టు పెట్టి కొంత మంది రైతులకు రైతు బంధు వేశారని చెప్పారు.

సంబంధిత పోస్ట్