ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)

41597చూసినవారు
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని సైబర్ చౌక్ వద్ద గ్రీన్ సిగ్నల్ పడడంతో కొన్ని బైక్‌లు రోడ్డు దాటుతున్నాయి. ఆ సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. రోడ్డు దాటుతున్న బైక్‌లను ఢీకొట్టింది. దీంతో బైక్‌లపై ఉన్న వారు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ చిన్నారి కిందపడ్డా, అదృష్టశాత్తూ ఏమీ కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్