ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి (వీడియో)

216547చూసినవారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు అడ్డొచ్చిన మోపెడ్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం డివైడర్‌ ఢీకొని గాల్లోకి ఎగిరింది. డివైడర్‌ అవతలి రోడ్డును దాటి సర్వీస్‌ రోడ్డుపై పడింది. మధురై తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్