మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్వాలియర్ జిల్లా కేంద్రంలోని విక్కీ ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో ఆదివారం రాత్రి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీలో ఉన్న సిబ్బంది భయంతో బయటకిబయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.