AP: నంద్యాల జిల్లాలో ఇంటర్ విద్యార్థిని లహరిని ప్రేమోన్మాది హతమార్చిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగా గుర్తించారు. ప్రేమ పేరుతో లహరిని వేధిస్తున్న దుర్మార్గుడు ఇవాళ తెల్లవారుజామున యువతి ఇంటికి వెళ్లాడు. నిద్రిస్తున్న యువతి నోట్లో దుస్తులు కుక్కి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో లహరి అక్కడికక్కడే మృతి చెందింది. రాఘవేంద్ర కూడా నిప్పంటించుకోగా.. అతడి పరిస్థితి విషమంగా ఉంది.