ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

73చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్‌ శివారులో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రేగళ్ల నరేష్‌(30), రేగళ్ల ప్రమోద్‌(25), సిద్దూ బైక్ పై రాంపూర్‌ వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. నరేష్‌ స్పాట్ లోనే మృతి చెందగా ప్రమోద్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. సిద్దూ చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్