బోర్ గా ఫీలవడం కూడా మంచిదేనట

75చూసినవారు
బోర్ గా ఫీలవడం కూడా మంచిదేనట
ఖాళీ సమయాల్లో చాలామంది బోర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అలా బోర్ గా ఫీలవడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఆ సమయంలో మన సెల్ ఫోన్ ను పక్కన పెట్టి క్రియేటివిటీపై ఫోకస్ చేయాలని అంటున్నారు. మీలో కొత్త ఆలోచనలు, కొత్త పనులు చేసేందుకు ఇది దోహదపడుతుందని, బోర్ గా అనిపించినప్పుడు ఇతరులతో మాట్లాడటం వల్ల కమ్యూనికేషన్ పెరిగి బంధాలు బలపడతాయని చెబుతున్నారు. ఏ పని లేనప్పుడు శరీరంతో పాటు మెదడుకు విశ్రాంతి దొరుకుతుందని, ఇది ఒత్తిడిని తగ్గించడంలో దోహదపడుతుందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్