TG: భువనగిరి పట్టణంలోని విద్యానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మహిళా ఏఆర్ కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లా కోయడకు చెందిన కే అనూష 2020లో ఏఆర్ కానిస్టేబుల్‌కు ఎంపికై యాదాద్రి జిల్లాలోని హెడ్ క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తుంది. కుటుంబ సభ్యులు ఇష్టంలేని పెళ్లి నిర్ణయించారని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.