సోషల్ మీడియాలో జంతువులతో మనుషులు చేసే కొన్ని ఫైట్స్ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసినట్లయితే ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వస్తుంటాడు. అతడి వెనుకాలే ఓ కంగారూ కూడా వస్తుంటుంది. వెనుక నుంచి ఆ వ్యక్తిని కిందకు పడేసిన కంగారు మళ్లీ అతడిపై దూసుకెళ్తుంది. కట్టె తీసుకుని కంగారును కొట్టినా వెనక్కి అడుగు వేయదు. వారిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ రేంజ్‌లో ఫైట్ జరుగుతుంది. చివరకు ఆ వ్యక్తి కంగారును కింద పడేస్తాడు.