తమిళ నటి ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత తిరుపతిలో సక్సెస్ టూర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఐశ్వర్య అభిమానులతో మాట్లాడుతూ.. తాను తిరుపతిలోనే చదువుకున్నానని, ఐ లవ్ తిరుపతి అని పేర్కొన్నారు.