ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ముగ్గురు మహిళలు జుట్టు పట్టుకుని నడిరోడ్డుపై కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిరోజ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారి పిల్లల మధ్య ఏదో గొడవ జరడంతో తల్లులు కల్పించుకున్నారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది భీకర దాడులకు కారణం అయింది.