చినాబ్ వంతెనపై వందేభారత్ ట్రయల్ రన్

53చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ వంతెనపై వందేభారత్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. ఇంజినీరింగ్ అద్భుతంగా పిలిచే ఈ బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు కాగా, ఎత్తు సముద్రమట్టం నుంచి 359 మీటర్లు. ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్లు ఎక్కువ. ఊదంపూర్–బారాముల్లా ప్రాజెక్టులో భాగంగా రైల్వేశాఖ దీనిని నిర్మించింది. దీనివల్ల జమ్మూ, కశ్మీర్ మధ్య ప్రయాణం సులభం అవుతుంది. త్వరలోనే ప్రయాణికులకు ఇది అందుబాటులోకి రానుంది.

సంబంధిత పోస్ట్