ఆట మధ్యలో ఫిట్స్.. కుప్పకూలిన బాక్సర్ (వీడియో)

71చూసినవారు
టీమ్ కాంబాట్ లీగ్ మ్యాచ్‌లో అనూహ్య ఘటన జరిగింది. ర్యాన్ అలెన్‌తో పోరాడుతుండగా, US బాక్సర్ ట్రమైన్ విలియమ్స్‌కు మ్యాచ్ మధ్యలో ఫిట్స్ వచ్చింది. దీంతో ట్రమైన్ కిందపడిపోయాడు. బాక్సింగ్ రింగ్‌లో కుప్పకూలిన అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ట్రమైన్ కొన్ని గంటల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని ఆయన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్