హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక కట్టడం చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. చార్మినార్‌ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఊడిన పెచ్చులు పడ్డాయి. దీంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గతంలోనూ పెచ్చులు ఊడితే అధికారులు మరమ్మతులు చేశారు.