'క్విక్ కామర్స్' వ్యాపారంలోకి ఫ్లిప్ కార్ట్ ఎంట్రీ ఇచ్చింది. 'మినిట్స్' పేరిట ఈ సేవలను ప్రారంభించింది. తొలుత బెంగళూరులోని పలు పిన్ కోడ్స్ లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో మిగిలిన నగరాలకూ విస్తరించే అవకాశం ఉంది. 10 నిమిషాల్లోనే వస్తువుల డెలివరీ అందించే క్విక్ కామర్స్ విభాగంలో ప్రస్తుతం జొమాటోకు చెందిన బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో, బిగ్ బాస్కెట్ వంటివి పోటీ పడుతున్నాయి.