ఇంట్లో ఉండే వస్తువులను కూడా వాస్తు ప్రకారం సర్దుకోవాలంటున్నారు నిపుణులు. వాటిల్లో ముఖ్యమైనది బీరువా. సరైన దిశలో బీరువాను పెట్టకపోతే నెగటివ్ ఎనర్జీ వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది బీరువాను నైరుతి దిక్కులో ఉంచుతారు. కానీ అది సరికాదంటున్నారు వాస్తు నిపుణులు. బీరువాను తెరిచినప్పుడు ఉత్తరం వైపు చూస్తుండేలా ఉంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల చాలా మార్పులు గమనిస్తారని చెబుతున్నారు.