ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ తీరంలో భారీగా కొకైన్ పట్టుబడింది. సుమారు 2,300 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.4 కోట్లకుపైగా ఉంటుందని వెల్లడించారు. ఈ డ్రగ్స్‌ని తరలిస్తున్న 13 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఆస్ట్రేలియాలో తొలిసారి ఇంత భారీ మొత్తంలో కొకైన్ లభ్యమైంది.