తెలంగాణలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ శాఖ వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్‌లో కేంద్రమంత్రితో సీఎం భేటీ అయ్యారు. అనుమతులు రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయన్నారు. 38 ప్రాజెక్టులకు వన్యప్రాణి సంరక్షణ చట్టాల పరమైన అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.