యూపీలోని లక్నోలో జనాలను హడలెత్తించిన పెద్దపులిని ఫారెస్ట్ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రహమాన్ ఖేడా ప్రాంతంలో ఓ పెద్దపులి 3 నెలల వ్యవధిలో 24 పెంపుడు జంతువులను వేటాడి చంపేసింది. దీంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురై అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది బుధవారం రాత్రి పెద్దపులిని బంధించారు.