సంక్రాంతి పండుగకు చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పండుగ రోజున తన మనవళ్లతో కలిసి సొంత గ్రామంలో సైకిల్ తొక్కుతూ సరదాగా గడిపారు. తన కుమారుడు హితేష్ చెంచురామ్ చిన్న కొడుకు రుద్రవరామ్‌ని సైకిల్‌పై ఎక్కించుకొని తిరిగారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.