మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నర్ శివ శంకర్ భార్య లక్ష్మీబాయి (94) గురువారం కన్నుమూశారు. ఆమె భర్త శివ శంకర్ విదేశాంగ మంత్రిగా, సిక్కిం గవర్నర్‌గా వ్యవహరించినప్పుడు ఆయనకు విశేష తోడ్పాటును అందించారు. దీంతో పెర్‌ఫెక్ట్ హోస్ట్‌గా గుర్తింపును సైతం సొంతం చేసుకున్నారు. ప్రముఖ వయోలినిస్ట్ ద్వారం వెంకటస్వామి నాయుడికి ఈమె మేనకోడలు.