ఉత్తరాఖండ్ మాజీ సిఎం హరీశ్ రావత్ పేరు ఓటరు జాబితాలో గల్లంతయింది. ఈ విషయాన్ని అధికారులే స్వయంగా వెల్లడించారు. నేడు ఆ రాష్ట్రంలో 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 43 మున్సిపాల్టీలు, 46 నగర పంచాయితీలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటేసేందుకు ఆ రాష్ట్ర మాజీ సీఎం హరీశ్ రావత్ డెహ్రాడూన్‌లో ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి వెళ్లారు. అయితే అక్కడ ఓటరు లిస్టులో ఆయన పేరు గల్లంతయింది. దీంతో ఆయన ఓటు వేయలేకపోయారు.