నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 1986 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గిరిజనులకు 12 ప్లాట్లను కేటాయించింది కానీ వాళ్ళ ఆర్థిక స్తోమత లేక ఇల్లు కట్టుకోలేకపోయారు. ఇప్పుడు కట్టుకుంటామని చెప్తుంటే అధికార పార్టీ సర్పంచ్ జితేందర్ రెడ్డి అధికారులతో కుమ్మకై హక్కు పత్రాలకు అడ్డుపడుతున్నాడు. ఎంఆర్ఓ కలిసిన ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని హక్కుదారులు వాపోయారు. కావున ఇప్పటికైనా స్పందించి గిరిజనులకు హక్కు పత్రాలు ఇచ్చేవరకు పోరాటం పోరాటం సాగిస్తామని హరీష్ నాయక్ తెలిపారు. ఈ పోరాటాన్ని దశలవారుగా ప్రారంభించి తీవ్ర రూపం దాల్చుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హక్కుదారులు చంద్రు బాలు గణేష్ శ్రీను దాక్య తదితరులు పాల్గొన్నారు.