కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణంతో ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం: మంత్రి
అమ్రాబాద్ మండలం మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం వలన రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. బుధవారం మన్ననూర్ ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ వద్ద ఆగారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ స్థానిక సమస్యలపై కాంగ్రెస్ నాయకులతో చిట్ చాట్ నిర్వహించారు. ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యం, సాగునీరు, కృష్ణానదిపై వంతెన ఏర్పాటు అంశాలను ఆయన దృష్టి తెచ్చారు.