అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం అభివృద్ధికి సహకారం అందించాలని మాజి సింగిల్ విండో చైర్మన్ సంకాపురం రాముడు కోరారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సి నవీన్ కుమార్ ని సొంత గ్రామం మొదలుగూడలో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి ఈ మేరకు విన్నవించారు. ఈయన వెంట మాజీ సర్పంచ్ మేడికొండ వెంకటేష్ కూడా ఉన్నారు.