వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కాలనీ 5వ వార్డులో సోమవారం కౌన్సిలర్ లెనిన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది పిచ్చిమొక్కల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. వర్షాకాలంలో డెంగీ, మలేరియ, చికెన్ గున్యా వంటి రోగాలు రాకుండా ముందు జాగ్రత్తగా పిచ్చిమొక్కలను తొలగింప చేయించినట్లు ఆయన చెప్పారు. కాగా ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చిమొక్కలను మాత్రం ఆయా యజమానులే తొలగించుకోవాలని కౌన్సిలర్ సూచించారు.