కొత్తకోటలో దత్త జయంతి ఉత్సవాలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే

81చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట పట్టణంలో దత్త జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనఘూదేవి సమేత దత్తాత్రేయ స్వామి మూర్తులకు పరిమళ పుష్ప అర్చన, అభిషేకం కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు దత్తాత్రేయ గుడి ధర్మకర్త భీమ వెంకటరమణ ఎమ్మెల్యే కు స్వాగత సత్కారం చేశారు. కార్యక్రమంలో నాయకులు భక్తులు, మహిళలు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్