మహబూబ్ నగర్ జిల్లా జమిస్తాపూర్ లో రూ. 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ధర్మాపూర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.