జడ్చర్ల: 9 వ తరగతి విద్యార్థి అదృశ్యం... కేసు నమోదు

75చూసినవారు
జడ్చర్ల: 9 వ తరగతి విద్యార్థి అదృశ్యం... కేసు నమోదు
విద్యార్థి అదృశ్యమైన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఎస్ఐ విక్రం వివరాల ప్రకారం.. నవాబుపేట మండలంలో లోకిరేవు గ్రామానికి చెందిన గౌతమ్ 9 వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 19 న భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో తన మేనత్త ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లలేదు. ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్