మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహానికి గురువారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ పోరాటం చేశారన్నారు. 'నాకు రక్తాన్ని ఇవ్వు. నీకు స్వేచ్ఛను ఇస్తా' అనే నినాదం దేశ స్వాతంత్ర్యానికి పునాది వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.