ఉద్దేశపూర్వకంగా దళితుల పెళ్లిని గుడి బయట జరుపుకోవాలని ఆదేశించి అవమానించిన ఆలయ పూజారి చక్రపాణి ప్రభుత్వ ఉద్యోగి పై చట్ట పరంగా చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. దీంతో బుధవారం నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రాల్లోని తహసిల్దార్ కార్యాలయంలో కుల సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మార్వో కు వినతిపత్రం పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ పూజారిపై వెంటనే విధులను తొలగించి అరెస్టు చేయాలని ఎమ్మార్వో కు విన్నవించారు.