ఆత్మకూరు: రైతు భరోసా ఎగవేతపై బీఆర్ఎస్ నిరసన

81చూసినవారు
ఆత్మకూరు: రైతు భరోసా ఎగవేతపై బీఆర్ఎస్ నిరసన
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైందని ఆత్మకూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం ఆత్మకూరు గాంధీ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్