సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. నారాయణపేట జిల్లా నర్వ మండలంలో గత ఎన్నికల్లో లక్కర్ దొడ్డి గ్రామపంచాయతీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో అవలంభించిన రిజర్వేషన్లే ఈసారి కూడా అమలు జరుగుతాయని తెలుస్తోంది. మరి ఈసారి కూడా గ్రామపంచాయతీ ఏకగ్రీవం కానుందా.? లేక ఎన్నికల జరిగే అవకాశం ఉందా.? మరి ఈ సారి రిజర్వేషన్ అంచనాలతో ఆశావాహులు ఎంతో ఎదురుచూస్తున్నారు.