ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
కృష్ణ మండలం ఖాన్ దొడ్డి గ్రామానికి చెందిన తారేశ్ భార్యతో గొడవపడి తన పొలంలో శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇదే విషయాన్ని తారేశ్ పోలీసులకు ఫోన్ ద్వారా చెప్పాడు. పోలీసులు వెంటనే స్పందించి ఫోన్ లోకేషన్ ఆధారంగా అక్కడికి చేరుకొని మాగనూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని కానిస్టేబుల్ రామ్ తేజ, భరత్ చెప్పారు. భార్య, తండ్రి కృతజ్ఞతలు తెలిపారు.