'ఐకార్'లో రూబికకు జాతీయ స్థాయి ర్యాంకు
మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన ఎస్. గోకారన్న, ఎస్. సువార్తమ్మ దంపతుల కుమార్తె రూబిక జాతీయ అగ్రికల్చర్ ఐకార్(ICAR) పరీక్షలో 383వ ర్యాంకు, కేటగిరి విభాగంలో 48వ ర్యాంకు సాధించింది. ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత తిరుపతయ్య ఆమెను ఆదివారం సన్మానించి అభినందించారు.