పత్తి పొలంలో మొసలి
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని దేవర చెరువు వెనుక ఉన్న చాకలి కందన సవారి సీడ్ పత్తి పొలంలో శుక్రవారం మొసలి ప్రత్యక్షం కావడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. ఓ తోటలో పూలు తెంపడానికి వెళ్లిన కూలీలకు మొసలి కనిపించడంతో కేకలు వేస్తూ రైతుకు సమాచారం అందించారు. ఆయన వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. పొలం సమీపంలో ఉన్న బావిలోకి మొసలి వెళ్లినట్లు తెలిసింది.