నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని హైదరాబాద్ చౌరస్తాలో గురువారం అదుపు తప్పి పత్తి గింజల లోడు లారీ బోల్తా పడ్డది. తృటిలో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో లారీ డ్రైవర్, క్లినర్ బయటపడ్డారు. రోడ్డుకు అడ్డంగపడడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు వచ్చి ట్రాఫిక్కును క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు