నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ కి చెందిన కొప్పుల బాలయ్య, కొప్పుల బాలమణి దంపతులకు ఇద్దరు పిల్లలు మల్లేశ్వరి 16, రాము14 సంవత్సరాలు. కుటుంబ గొడవల వల్ల తండ్రి బాలయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. సంవత్సరం తర్వాత కొప్పుల బాలమణి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారు. వారి అమ్మమ్మ బుద్ధి ఈశ్వరమ్మ పిల్లల పోషణ చేసేది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
ఈ విషయం కల్వకుర్తి సీఐ దృష్టికి తీసుకెళ్లగా వారికి తమ వంతుగా నిత్యావసర సరుకులు. బియ్యం. ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కానీ మంగళవారం బొద్ది ఈశ్వరమ్మ అనారోగ్య పాలై వైద్యానికి డబ్బులు లేక చనిపోవడం జరిగింది. వృద్ధురాలు మృతి అనాథగా మారిన చిన్నారులు మహేశ్వరి (16) రాము(14) విషయం తెలుసుకున్న కల్వకుర్తి సీఐ ఆ అనాధ పిల్లలకు నేనున్నానంటూ ఆర్థిక సహాయం చేయడమే కాక ఉన్నత చదువులకు ఆ అనాధ చిన్నారులను అన్ని వేళల ఆదుకుంటానని మరోసారి భరోసా కల్పించిన కల్వకుర్తి సీఐ అవుల సైదులు మృతురాలి కుటుంబాన్ని సంతాపం తెలుపుతూ 3000/- రూపాయలు ఆర్థిక సాయం మరియు చిన్నారులు చదువుకోడానికి ఐసిడిఎస్ అధికారులతో మాట్లాడి వారి ద్వారా కూడా నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం ఇప్పించడం జరిగినది.
అలాగే చిన్నారులను సంక్షేమం కొరకు చదువుకోడానికి అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగినది. ఆ చిన్నారుల ఇంటి నిర్మాణం కోసం కూడా తమ వంతు సహాయం ఉంటుందని. కల్వకుర్తి పట్టణంలో దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని సీఐ సైదులు అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ నజీర్, వర్మ, సుభాష్ నగర్ మూర్తి, కాలనీ వాసులు ఉన్నారు.