అచ్చంపేట: అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు

51చూసినవారు
కణితిని వేటాడిన సంఘటనలో 9 మంది వేటగాళ్లను అరెస్టు చేసినట్లు అచ్చంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ శుకూర్ తెలిపారు. బుధవారం చేదురుబావి తండాలో కణితి మాంసాన్ని దాచినట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం మేరకు 9మందిని అరెస్టు చేసి కల్వకుర్తి కోర్టులో హాజరు పరచగా నిందితులకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు. వన్యప్రాణులను రక్షించుకునేందుకు ఈ ప్రాంత ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్