నారాయణపేట బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ బహదూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రఘురామయ్య గౌడ్, రఘువీర్ యాదవ్, నందు నామాజీ పాల్గొన్నారు.