సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక దీక్షలు మూడవ రోజుకు చేరుకున్నాయి. శనివారం నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద నిర్వహించిన దీక్షలో కళ్ళకు గంతలు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. దీక్షలకు సీఐటీయూ, పీడీఎస్యూ నాయకులు సంఘీభావం తెలిపారు. సీఐటీయూ గౌరవ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, కార్యదర్శి బలరాం మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు.