మరికల్: అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తరోకో

59చూసినవారు
రైతులకు రైతు బంధు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మరికల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. మండల అధ్యక్షుడు తిరుపతయ్య మాట్లాడుతూ. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అని అన్నారు. నాయకులను గ్రామాల్లో రైతులు నిలదీయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్