ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది

68చూసినవారు
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని శిక్షణ కలెక్టర్ గరిమా నరుల గురువారం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట ఆర్డిఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. సమాజాన్ని మార్చే శక్తి కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వుందని అన్నారు.

సంబంధిత పోస్ట్