వనపర్తి జిల్లా కేంద్రంలోని 26వార్డు టీచర్స్ కాలనీ యూత్ ఏర్పాటు చేసిన గణపతిని టీచర్స్ కాలనీలో ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాలనీవాసులు శాలువా పూలమాలతో చిన్నారెడ్డిని సన్మానించారు. భక్తులతో కలిసి ఫోటోలు దిగారు. కరోనా కాలంలో కూడా గణేశుడిని పెట్టారని, 18ఏళ్లుగా ఉత్సవాలను చేస్తున్నామని యువత చెప్పగా చిన్నారెడ్డి అభినందించారు.