మహాత్మ గాంధీ విగ్రహానికి జి. చిన్నారెడ్డి నివాళి

78చూసినవారు
మహాత్మ గాంధీ విగ్రహానికి జి. చిన్నారెడ్డి నివాళి
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తూ అహింస శాంతి మార్గాలలో ప్రయాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు రాజేంద్రప్రసాద్ యాదవ్, బి కృష్ణ, కోట్లరవి, ఖమ్మర్ మియా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్