దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి కలెక్టర్, ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.