'విజయమో.. వీరస్వర్గమో' అంటూ గాంధీజీ పిలుపు

575చూసినవారు
'విజయమో.. వీరస్వర్గమో' అంటూ గాంధీజీ పిలుపు
బ్రిటిషర్ల వలస పాలనకు చరమగీతం పాడి.. జాతీయోద్యమంలో కీలక ఘట్టంగా మిగిలిపోయింది క్విట్‌ ఇండియా ఉద్యమం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమం. దీనిని ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు. విజయమో.. వీరస్వర్గమో అంటూ గాంధీజీ ఇచ్చిన పిలుపునకు భారతీయులు ఆ మర్నాడు (ఆగస్టు 9) నుంచి ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. అయిదేళ్ల తిరిగేసరికల్లా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది.

సంబంధిత పోస్ట్