పాటల తోటమాలి 'వేటూరి'

74చూసినవారు
తెలుగు సినీ గీతానికి కొత్త జిలుగులద్దిన కవి వేటూరి సుందరరామ్మూర్తి. ప్రకృతిని పెనవేస్తూ, రసికతను జోడిస్తూ, చమత్కారాన్ని పొంగిస్తూ ఆయన రాసిన పాటలు శ్రోతల్ని ఓలలాడించాయి. వేటూరి ప్రాసలు, అలంకారాలతో పాట పట్టుచీర కట్టి హొయలొలుకుతుంది. మాతృదేవోభవ సినిమాలో 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే' వంటి పాటలు హృదయాలను ద్రవింపజేశాయి. పదాలకు ప్రాణం పోసి సాహిత్యాన్ని పరవళ్లు తొక్కించిన ఆ మహాకవి వర్ధంతి నేడు.

సంబంధిత పోస్ట్