ఎమ్మెల్యే పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు

84చూసినవారు
ఎమ్మెల్యే పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు
AP: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్‌ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయ‌న విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేశారు. IPC, RP, PDPP చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్